ICC T20 World Cup 2021: India and Afghanistan are set to face each other in their upcoming match in ICC T20 World Cup 2021 at Sheikh Zayad Stadium in Abu Dhabi.
#T20WorldCup2021
#IndiavsAfghanistan
#IndiaPlayingXI
#INDvAFG
#NewZealandBeatIndia
#BCCI
#RohitSharma
#ViratKohli
రెండు పెద్ద జట్లపై నిరాశాజనక పెర్ఫామెన్స్‌తో నాకౌట్ ఆశలను క్లిష్టం చేసుకున్న భారత్ .. టీ20 ప్రపంచకప్‌లో పసికూనలతో పోరుకు సిద్దమైంది. నేటి(బుధవారం) సాయంత్రం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ టోర్నీలో ఇంకా బోణీ చేయకపోగా... అఫ్గాన్ టీమ్ తమకంటే బలహీనమైన నమీబియా, స్కాట్లాండ్‌లపై ఘన విజయాలు సాధించి గ్రూప్ టాపర్ పాకిస్తాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమరం జరగవచ్చు. పేలవ ప్రదర్శనతో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో పరాజయంపాలైన భారత్.. అన్ని విభాగాల్లోనూ గణనీయంగా మెరుగుపడాల్సివుంది. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌ను ఓడిస్తుందా? అనేది కూడా సందేహంగా మారింది.